‘ఆహ్వానం’ లోగో వదిలిన మంచు మ‌నోజ్‌

young hero manchu manoj launches aahwanam logo

వ‌జ్ర మూవీ ప్ర‌మోష‌న్ ఏజెన్సి గురించి ప్రత్యేకంగా ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌రంలేదు. ఎందుకంటే ఎంద‌రో స్టార్ హీరోల‌తో సహా ఎన్నో సూప‌ర్‌హిట్ మూవీస్‌కి త‌మ‌దైన శైలిలో ప్ర‌మోషన్స్ చేసి ఆ చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కి మ‌రింత‌గా చేరువ‌య్యేలా చేసిన ఘ‌న‌త‌ వారిది. ప్ర‌స్తుతం వ‌జ్ర గ్రూప్స్ ఆహ్వానం పేరుతో ఆతిథ్య రంగంలోకి అడుగుపెడుతున్నారు. దీనిలో భాగంగా మొద‌ట‌గా కన్వెన్షన్ హాల్‌ను ఏర్పాటు చేశారు. ఇటివలే ప్రముఖ హీరో మంచు మ‌నోజ్ ఆహ్వానం లోగోను ఆవిష్క‌రించారు. అక్టోబ‌ర్ 23న సాప్ట్ లాంచ్ చేస్తున్నారు.

`మీరు ఒక పార్టీని హోస్ట్ చేయాలంటే 500 నుండి 1000 మందికి వసతి కల్పించడానికి ఒక కన్వెన్షన్ హాల్ అవసరం. మేము మీ గో-టు సోర్స్. మీ ఈవెంట్‌లను మా ఉత్తమ సేవలతో ఆదర్శప్రాయంగా చేయడానికే మేము ఈ రంగంలోకి ప్ర‌వేశించ‌డం జ‌రిగింది. వినియోగదారుడి సంతృప్తే ప్ర‌ధ‌మ ల‌క్ష్యంగా ఆహ్వానం బాంకెట్, రిసార్ట్, కన్వెన్షన్ హాల్స్‌తో హాస్పిటాలిటీ పరిశ్రమలో ట్రెండ్‌సెట్టర్లుగా నిల‌వ‌బోతుంది. మా ఆహ్వానం లోగో రిలీజ్ చేసిన యంగ్ హీరో మంచు మ‌నోజ్‌గారికి మా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు“ అని వ‌జ్ర గ్రూప్ అధినేత అరుణ్ కుమార్ తెలిపారు.

Related posts

Leave a Comment