రొమాన్స్ 2 ఇన్ 1 ఫస్ట్ లుక్ విడుదల

romance 2 in 1 first look poster released

యావర అహమ్మద్, మనీషా పిలై ప్రధాన పాత్రలో జి.ఎస్.కె ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సరికొత్త వెబ్ సిరీస్ ‘రొమాన్స్ 2 ఇన్ 1’. ‘ఒకే ఆత్మ హీరో హీరోయిన్ ఇద్దరినీ ప్రేమిస్తే’ అనే ఆసక్తికరమైన కథ కథాంశంతో త్వరలో మీ ముందుకు వస్తుంది. శివ ఈ వెబ్ సిరీస్‌ని స్వీయ దర్శకత్వం చేస్తున్నారు. దసరా పండగ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ యొక్క మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత శివ మాట్లాడుతూ… “ఇది చాలా డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ కథ. మంచి ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిస్తునాం. ఒకే ఆత్మ హీరో హీరోయిన్ ఇద్దరినీ ప్రేమిస్తుంటుంది. అలా ఒకే ఆత్మ హీరో హీరోయిన్ ఇద్దరినీ ఎందుకు ప్రేమిస్తుంది, ఆ ఆత్మ ఎవరు, తన కథ ఏంటి, చివరికి ఏమౌంతుంది అనేది కథ. ఈ రోజు దసరా సందర్భంగా మా ‘రొమాన్స్ 2 ఇన్ 1’ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశాము. నవంబర్‌లో టీజర్‌ను విడుదల చేసి త్వరలో ఓటీటీలో విడుదల చేస్తాం” అని తెలిపారు.

బ్యానర్ : జి.ఎస్.కె ప్రొడక్షన్స్

టైటిల్ : రొమాన్స్ 2 ఇన్ 1

సంగీతం : నవనీత్ చారి

కెమెరా మాన్ : గోపి

ఎడిటర్ : కృష్ణ

రచన, దర్శకత్వం, నిర్మాత : శివ

Related posts

Leave a Comment