విడుదలకు సిద్ధమైన ‘ఏమైపోయావే’

emai poyave movie

శ్రీరామ్ క్రియేషన్స్, వీఎం స్టూడియోస్ పతాకాలపై మురళి దర్శకత్వంలో రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి హీరోహీరోయిన్లుగా నిర్మాత హరి కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘ఏమైపోయావే’. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మోషన్ పొస్టర్ కు మంచి స్పందన లభించింది.

ఈ సందర్బంగా నిర్మాత హరికుమార్ మాట్లాడుతూ… ”మా బ్యానర్లో ‘ఏమైపోయావే’ చిత్రం ఒక మంచి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. సినిమా బాగా రావడానికి ఆర్టిస్ట్స్, టెక్నిషియన్స్ ఎంతగానో సహకరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయిన మా చిత్ర సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం, అందరికీ నచ్చే విధంగా ఈ సినిమా ఉండనుంది అన్నారు.

రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి, శ్రీను కేసబోయిన, మిర్చి మాధవి, సునీత మనోహర్, నామాల మూర్తి, మీసం సురేష్, మళ్ళీ రావా బుజ్జి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: శాంతి పుత్ర విజయ్, సినిమాటోగ్రఫీ: శివ రాధోడ్, సంగీతం: రామ్ చరణ్, పాటలు: తిరుపతి జానవ, పీఆర్వో: సాయి సతీష్, నిర్మాత: హరి కుమార్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మురళి.

Related posts

Leave a Comment