నటి పూజిత పొన్నాడ ఆవిష్కరించిన యమ్ ఫార్మ్స్ స్టోర్

m farms store launch

కొండాపూర్లోని రాజరాజేశ్వరీ నగర్ లొ నూతనంగా ఏర్పాటు చేసిన యమ్ ఫార్మ్స్ స్టోర్ ను నటి పూజిత పొన్నాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి పూజిత యమ్ ఫార్మ్స్ ఎండీ-పవన్ రెడ్డికి మరియు ఫ్రాంచైజీ ఓనర్ యాస్మిన్‌కు తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎండీ-పవన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం శుభ్రత చాలా అవసరంగా మారింది. కానీ శుభ్రతతో పాటు నాణ్యత కూడా చాలా ముఖ్యమైనది. మా స్టోర్ ద్వారా వినియోగదారులకు శుభ్రత మరియు నాణ్యత కలిగిన పండ్లు మరియు కూరగాయలను అందిస్తున్నాము. విజయదశమి నాడు మొదలు పెట్టిన ఏ కార్యక్రమాలైనా విజయాల బాటలొ సాగిపోతాయనే సంకల్పంతో విజయ దశమిరోజు మా స్టోర్‌ను ప్రారంభించడం జరిగింది. అన్ని యమ్ ఫార్మ్ స్టోర్ లు(FOCO) ఫ్రాంఛైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటడ్ మోడల్‌లో యమ్ ఫార్మ్స్ కంపెనీ చేత నడుపబడతాయి.…

మీర్జాపూర్ 1ని మించేలా మీర్జాపూర్ 2: పంక‌జ్ త్రిపాఠి

pankaj tripathi mirzapur 2 web series interview

ప్ర‌ముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుద‌లైన సూప‌ర్ హిట్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ 1కి సీక్వెల్ గా మీర్జాపూర్ సీజ‌న్ 2 అక్టోబ‌ర్ 23న రాబోతుంది. సీజ‌న్ 1లో ఖాలీన్ భ‌య్యాగా ఫేమెస్ అయిన న‌టుడు పంక‌జ్ త్రిపాఠి సిజీన్ 2 రిలీజ్ సంద‌ర్భంగా తెలుగు సినీ పాత్రికేయ‌ల‌తో ముచ్చ‌టించారు, ఆయ‌న‌తో జ‌రిగిన చిట్ చాట్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీర్జాపూర్ సీజ‌న్ 1 లో నేను పోషించిన కాలిన్ భ‌య్య పాత్ర న‌న్ను తెలుగు ఆడియెన్స్ కి మ‌రింత ద‌గ్గ‌ర చేసింది. రోజుకి సోష‌ల్ మీడియా ద్వారా తెలుగు వారు పంపిస్తున్న మెసేజ్ లు చ‌దువుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మీర్జాపూర్ సీజ‌న్ 2 రాబోతుంద‌నే ప్ర‌క‌ట‌ణ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి తెలుగులో రిలీజ్ అవుతుందా లేదా అని…

‘ఆహ్వానం’ లోగో వదిలిన మంచు మ‌నోజ్‌

young hero manchu manoj launches aahwanam logo

వ‌జ్ర మూవీ ప్ర‌మోష‌న్ ఏజెన్సి గురించి ప్రత్యేకంగా ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌రంలేదు. ఎందుకంటే ఎంద‌రో స్టార్ హీరోల‌తో సహా ఎన్నో సూప‌ర్‌హిట్ మూవీస్‌కి త‌మ‌దైన శైలిలో ప్ర‌మోషన్స్ చేసి ఆ చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కి మ‌రింత‌గా చేరువ‌య్యేలా చేసిన ఘ‌న‌త‌ వారిది. ప్ర‌స్తుతం వ‌జ్ర గ్రూప్స్ ఆహ్వానం పేరుతో ఆతిథ్య రంగంలోకి అడుగుపెడుతున్నారు. దీనిలో భాగంగా మొద‌ట‌గా కన్వెన్షన్ హాల్‌ను ఏర్పాటు చేశారు. ఇటివలే ప్రముఖ హీరో మంచు మ‌నోజ్ ఆహ్వానం లోగోను ఆవిష్క‌రించారు. అక్టోబ‌ర్ 23న సాప్ట్ లాంచ్ చేస్తున్నారు. `మీరు ఒక పార్టీని హోస్ట్ చేయాలంటే 500 నుండి 1000 మందికి వసతి కల్పించడానికి ఒక కన్వెన్షన్ హాల్ అవసరం. మేము మీ గో-టు సోర్స్. మీ ఈవెంట్‌లను మా ఉత్తమ సేవలతో ఆదర్శప్రాయంగా చేయడానికే మేము ఈ రంగంలోకి ప్ర‌వేశించ‌డం జ‌రిగింది. వినియోగదారుడి సంతృప్తే ప్ర‌ధ‌మ…

ప్రతిభావంతుల కోసం ‘డెక్కన్‌ మ్యూజిక్‌ ఛాలెంజ్‌’

shashi preetam and aiswarya krishna priya launch deccan music challenge

గాయనీ గాయకులను, బ్యాండ్స్‌ను వెలుగులోకి తీసుకు రావాలనే గొప్ప ఉద్దేశంతో సంగీత దర్శకుడు శశి ప్రీతమ్‌ సోమవారం నాడు ‘డెక్కన్‌ మ్యూజిక్‌ ఛాలెంజ్‌’ కాంపిటీషన్‌ ప్రారంభించారు. దీనికి ఆయన కుమార్తె ఐశ్వర్య క్రిష్ణప్రియ నిర్మాత. వీళ్ళిద్దరూ కలిసి ప్రారంభించిన ఈ కాంపిటీషన్‌ సుమారు 12 వారాలు సాగనుంది. ఆ తరువాత 13వ వారంలో ఫైనల్స్‌ జరగనున్నాయి. ‘డెక్కన్‌ మ్యూజిక్‌ ఛాలెంజ్‌’ ప్రారంభమైన సందర్భంగా శశి ప్రీతమ్‌ మాట్లాడుతూ ‘‘మన దగ్గర చాలామంది సంగీత కళాకారులు ఉన్నారు. వాళ్ళందరూ ప్రజలకు తెలియదు. సినిమాలో గాయనీ గాయకులు ప్రేక్షకులకు తెలుస్తారు. కానీ, వేరే వాళ్ళు బయటకు తెలియదు. గత ఐదేళ్ళుగా రాక్‌ బ్యాండ్‌ సంస్కృతి హైదరాబాద్‌లో పెరిగింది. ఇప్పుడు రాక్‌ బ్యాండ్‌ ట్రెండ్‌ అవుతున్నాయి. పబ్స్‌లో వాళ్ళకు అవకాశాలు వస్తున్నాయి. తొలుత ఇంగ్లిష్‌ పాటలతో ప్రారంభించిన బాండ్స్‌, పబ్లిక్‌ డిమాండ్‌…

శోభానాయుడు లోటు తీర్చలేనిది: చిరు

chiranjeevi mourns the loss of eminent kuchipudi expert shobha naidu

ఈ రోజు ఉదయాన్నే శోభానాయుడు మరణవార్త వినగానే నేను నిర్ఘాంతపోయాను. శోభానాయుడు గొప్ప కూచిపూడి కళాకారిణి. నృత్య కళకే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప కళాకారిణి ఆమె. ఆ స్థాయి కళాకారులు మళ్ళీ వస్తారా అనేది పెద్ద ప్రశ్నే. శ్రీ వెంపటి చిన్న సత్యం తర్వాత ఆయన శిష్యురాలిగా ఆయనంత ఖ్యాతినీ, కీర్తినీ కూచిపూడి నృత్య కళకు తీసుకొచ్చిన గొప్ప కళాకారిణి ఆమె. వారితో నాకు వ్యక్తి గతంగా ఎంతో పరిచయం ఉంది. ఒకరిని ఒకరు అభిమానించుకొని ప్రసంశించుకునే కళాకారులం. ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన సమయంలో ఆమె చేసిన ఓ నృత్య గేయం కూడా చూశాను. అది చూసినప్పుడు నాకూ ఎంత ముచ్చట కలిగిందంటే శారీరకంగా ఇబ్బంది ఉన్నా సరే దాన్ని అధిగమించి సమాజం కోసం కరోనా గురించి స్పందించి ప్రజల్ని చైతన్యం చేయడం…

జనసేనానితో కిచ్చా భేటీ

Kichha Sudeep meets Power Star Pawan Kalyan

జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్‌ని ప్రముఖ నటుడు, కన్నడ కథానాయకుడు కిచ్చా సుదీప్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ కార్యాలయానికి సుదీప్ గారు వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కి మొక్కలు బహూకరించారు. వారిద్దరి మధ్య సుమారు గంట సేపు సంభాషణ సాగింది. కోవిడ్ అన్ లాక్ నేపథ్యంలో ఇటీవలే సినిమా చిత్రీకరణలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తాను నటిస్తున్న చిత్రాల గురించి సుదీప్ వివరించారు. కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ చేయడంపై వారిద్దరూ మాట్లాడుకున్నారు. వర్తమాన, సామాజిక అంశాలపై ఆలోచనలను పంచుకున్నారు. ఆసక్తికర అంశం ఏమిటంటే… ఇద్దరి జన్మదినం సెప్టెంబర్ 2వ తేదీ కావడం.

అల్లు వారి ‘అల్లు స్టూడియోస్’ ప్రారంభం

Allu Ramalingaiah birth anniversary special Allu Studio Launched

తెలుగు ప్రేక్ష‌కులకు… తెలుగు సినిమా బతికున్నంతకాలం… గుర్తుండిపోయే పేరు పద్మశ్రీ డాక్ట‌ర్‌ అల్లు రామ‌లింగ‌య్య. హాస్యం ఆయ‌న కేరాఫ్ ఆడ్రస్‌, హాస్యానికే ప్రాణం పోసిన బ్ర‌హ్మ ఆయ‌న‌.. అన్ని ర‌సాల్లో హస్యానికి పెద్దపీట వేశారు కాని ఏ పాత్ర‌నైనా అల‌ఓక‌గా చేసి చూపించిన గొప్ప న‌టుడు అల్లు రామ‌లింగ‌య్య. 1000 కి పైగా చిత్రాల్లో నటించి… తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కి మార్గదర్శకుడయ్యాడు. ఆయ‌న తెర‌పై క‌నిపిస్తే పాత్ర క‌నిపిస్తుందికాని ఆయ‌న క‌నిపించ‌రు. న‌ట‌న‌కి నిలువెత్తు రూపం అల్లు రామ‌లింగ‌య్య అంటే అతిశ‌యోక్తికాదు. తెలుగు సినిమా చరిత్రలో గ‌ర్వించ‌ద‌గ్గ‌ గొప్ప క్లాసిక్స్ లో అల్లు రామ‌లింగ‌య్య పాత్రలు వుండ‌టం విశేషం. హోమియోపతి డాక్ట‌ర్ గా ప‌లు సేవాకార్య‌క్ర‌మాలు అందించారు, త‌రువాత తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో న‌టుడుగా ఎంత బిజీగా వున్నా కూడా త‌న వృత్తి హోమియోప‌తిని మాత్రం వ‌ద‌ల్లేదు.…

వే టు వాష్ డ్రైక్లీనింగ్ అండ్ వాష్ ప్రారంభం

ఈ బిజీ సమయంలో క్లాత్ వాషింగ్ అనేది అందరికి పెద్ద బర్డెన్‌గానే వుంటుంది. ఈ కరోనా సమయంలో బట్టలశుభ్రత మరింత అవసరం. అయితే మీకు అందుబాటు ధరలో మీ బట్టల శుభ్రత బరువును దించేయాలనుకుంటుది వే టు వాష్ డ్రైక్లీనింగ్ సంస్థ. ఇటీవల మాదాపూర్‌లోని అయ్యప్పసోసైటీలో, హాండ్రెడ్ ఫీట్స్ రోడ్డులో ఈ సంస్థ వే టు వాష్ డ్రైక్లీనింగ్ పేరుతో తొలి ఔట్‌లెట్‌ను ప్రారంభించింది. వేటు వాష్ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే ఉచిత పికప్ అండ్ డ్రాప్‌తో సర్వీసులు అందిస్తున్నామని, పూర్తి హైజీనిక్‌తో.. ఎంతో నాణ్యమైన సేవలను ఇస్తున్నామని సంస్థ నిర్వాహకులు గరగ సోమన్న, వెంకటసత్యనారాయణ గొల్ల తెలిపారు. త్వరలోనే జంటనగరాల్లో తమ ఔట్‌లెట్‌లు విస్తరిస్తున్నట్లుగా వారు తెలిపారు.

గాన గంధర్వుడు బాలు కన్నుమూత

Gaana Gandharva SP Balasubrahmaniam no More

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు గురువారం ప్రకటించిన ఎంజీఎం వైద్యులు.. ఆయన తుది శ్వాస విడిచినట్లు శుక్రవారం వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఎస్పీ బాలు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఎస్పీబీ ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు. అయితే.. ఇతర అనారోగ్య కారణాలు తిరగబెట్టడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆగస్ట్ 5న ఆయన చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌‌కేర్‌లో చేరారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం 1946 జూన్‌ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన తండ్రి పేరు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి. తల్లి పేరు శకుంతలమ్మ. బాలు జీవిత భాగస్వామి పేరు సావిత్రి. బాలు…