క‌లర్ ఫొటో డైరెక్ట‌ర్ సందీప్ రాజ్ ఇంట‌ర్వ్యూ

director sundeep raj interview

క‌ల‌ర్ ఫొటో రిలీజ‌య్యాక మీకు వ‌చ్చిన బెస్ట్ కాంప్లీమెంట్స్ హీరో నానిగారు కాల్ చేసి, సినిమా బాగా తీశాను అని అభినందించారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయ‌న క‌ల‌ర్ ఫొటో సినిమాని రెండు సార్లు చూశాను అని చెప్ప‌డం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ర‌వితేజ‌గారు, డైరెక్ట‌ర్ మారుతి గారు, రాజమౌళి గారు ఇలా ఇండ‌స్ట్రీకి చెందిన పలువురు ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా అభినందించడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. కొంద‌రు హీరోలు ఫోన్ చేసి త్వ‌ర‌లోనే క‌లుద్దాం అని చెప్ప‌డం ఇవ‌న్ని నాలో మరింత‌గా ఆత్మ విశ్వాసం పెంచుతున్నాయి. ఈ సినిమా ద్వారా మీరు నేర్చుకున్న కొత్త విష‌యాలు ఏంటి షార్ట్ ఫిల్మ్స్ చేసేట‌ప్పుడు నేను చాలా లిమిటెడ్ క్రూతో వ‌ర్క్ చేశాను, ఫీచ‌ర్ ఫిల్మ్‌కి వ‌చ్చేస‌రికి మాత్రం సెట్‌లో 80 నుంచి 100 మంది క్రూతో వ‌ర్క్…

నటి పూజిత పొన్నాడ ఆవిష్కరించిన యమ్ ఫార్మ్స్ స్టోర్

m farms store launch

కొండాపూర్లోని రాజరాజేశ్వరీ నగర్ లొ నూతనంగా ఏర్పాటు చేసిన యమ్ ఫార్మ్స్ స్టోర్ ను నటి పూజిత పొన్నాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి పూజిత యమ్ ఫార్మ్స్ ఎండీ-పవన్ రెడ్డికి మరియు ఫ్రాంచైజీ ఓనర్ యాస్మిన్‌కు తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎండీ-పవన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం శుభ్రత చాలా అవసరంగా మారింది. కానీ శుభ్రతతో పాటు నాణ్యత కూడా చాలా ముఖ్యమైనది. మా స్టోర్ ద్వారా వినియోగదారులకు శుభ్రత మరియు నాణ్యత కలిగిన పండ్లు మరియు కూరగాయలను అందిస్తున్నాము. విజయదశమి నాడు మొదలు పెట్టిన ఏ కార్యక్రమాలైనా విజయాల బాటలొ సాగిపోతాయనే సంకల్పంతో విజయ దశమిరోజు మా స్టోర్‌ను ప్రారంభించడం జరిగింది. అన్ని యమ్ ఫార్మ్ స్టోర్ లు(FOCO) ఫ్రాంఛైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటడ్ మోడల్‌లో యమ్ ఫార్మ్స్ కంపెనీ చేత నడుపబడతాయి.…

పూజా కార్య‌క్ర‌మాలు జరుపుకున్న మేరా నామ్ జోక‌ర్

mera naam joker movie launch

1970లో విడుద‌లై సంచలన విజయం సాధించిన మేరా నామ్ జోక‌ర్ గురించి తెలియ‌ని వారుండ‌రు. అలాంటి లెజెండ‌రీ క్లాసిక్ టైటిల్‌ని మ‌రొక్క‌సారి ద‌ర్శ‌కుడు సూర్య‌గోపాల్ ప‌రిచ‌యం చేస్తున్నారు. 4ఏఎమ్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో సూర్య‌గొపాల్‌ని ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మాత‌లు శివ ఎన్‌, ఎస్‌.జి.కృష్ణ, న‌వీన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విజ‌యద‌శ‌మి సంద‌ర్బంగా సంచలన దర్శకుడు మారుతి ఆధ్వర్యంలో పూజాకార్య‌క్ర‌మాలు జరుపుకుంది. మారుతి ఈ సినిమాకి సంబంధించిన మొదటి షాట్ దేవుడు ప‌టాల‌పై క్లాప్ కొట్టి స్టార్ట్ చేశారు. అలాగే ద‌ర్శ‌కుడు గోపాల్‌కి స్క్రిప్ట్ అందించారు. ఈ చిత్రం న‌వంబ‌ర్‌లో సెట్స్ మీద‌కి వెళ్ళ‌నుంది. ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ.. నా స్నేహితుడు సూర్య గొపాల్‌కి సినిమా అంటే చాలా ఇష్టం. మేరా నామ్ జోక‌ర్ అనే టైటిలంటేనే సూప‌ర్‌హిట్‌. అలాంటిది చాలా సంవ‌త్స‌రాల త‌రువాత…