పివియమ్ జ్యోతి ఆర్ట్స్ పతాకంపై మహి రాథోడ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘1992’. విజయ దశమిని పురస్కరించుకుని ఈ చిత్రంలోని ‘చెలియా చెలియా ..’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని సెన్సేషనల్ డైరక్టర్ వి.వి.వినాయక్ లాంచ్ చేయగా, మరో లిరికల్ వీడియోను నిర్మాత రాజ్ కందుకూరి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ…‘1992’ టైటిల్‌తో పాటు సాంగ్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. కొత్త వారిని ప్రోత్సహించడానికి నేనెప్పుడూ ముందుంటాను. కొత్త వారు చేస్తోన్న ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ… ‘‘కొత్త కాన్సెప్ట్ తో కొత్త వారందరూ కలిసి చేస్తోన్న 1992 చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ఈ రోజు నేను లాంచ్ చేసిన పాట వినసొంపుగా ఉంది’’ అన్నారు. దర్శకుడు శివ పాలమూరి మాట్లాడుతూ..‘‘దర్శకుడుగా ఇది…
Day: October 25, 2020
గౌతంరాజు తనయుడి మరో చిత్రం ప్రారంభం
డి ఎస్ ఆర్ ఫిలిం ప్రొడక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై హాస్య నటుడు గౌతమ్ రాజు కొడుకు కృష్ణ మరియు ఆయుషి హీరో హీరోయిన్గా డి ఎస్ రాథోడ్ దర్శకత్వంలో వస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ఈ రోజు హైదరాబాద్‌లోని సారధి స్టూడియోస్‌లో ఘనంగా ప్రారంభం అయ్యింది. తనికెళ్ళ భరణి మరియు కె ఎస్ రవి కుమార్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పూజ కార్యక్రమం అనంతరం హీరో హీరోయిన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ళ భరణి క్లాప్ ఇవ్వగా, కె ఎస్ రవి కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. అనంతరం పాత్రికేయులతో దర్శకులు డిఎస్ రాథోడ్ మాట్లాడుతూ.. ‘‘మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిధులు గౌతమ్ రాజు గారికి, తనికెళ్ళ భరణి గారికి మరియు కె ఎస్ రవి కుమార్…
కోతి కొమ్మచ్చి సినిమా మొదలైంది
మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్నలు హీరోలుగా కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘కోతి కొమ్మచ్చి’ . లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిలుగా విచ్చేసిన నిర్మాత దిల్ రాజు మొదటి షాట్‌కి క్లాప్ ఇవ్వగా, హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ… “యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న మా చిత్రాన్ని విజయదశమి పర్వదినం రోజు ప్రారంభించడం జరిగింది. నవంబర్ 3 నుండి అమలాపురంలో షూటింగ్ మొదలు పెడతాము. ఆ తర్వాత వైజాగ్‌లో కొంత పార్ట్ షూట్ చేయబోతున్నాము. ఒకే షెడ్యుల్‌లో సినిమాను పూర్తి చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నాము.”…
మారుతి వదిలిన ‘మాయ’ టీజర్
ప్రవాస భారతీయురాలైన రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాయ’. సంధ్య బయిరెడ్డి ప్రధాన పాత్ర పోషించగా, రోహిణి కుమార్, అభిషేక్, ఐడా, మధు, మహిమా ఇతర పాత్రధారులుగా నటించారు. రేసన్ ప్రొడక్షన్స్, విఆర్ ప్రొడక్షన్స్ పతాకాలపై గోపికృష్ణ జయంతి నిర్మించారు. ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డస్టిన్ లీ ఈ చిత్రానికి వర్క్ చేయడం విశేషం. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ రాగా ‘మాయ’ ఫస్ట్‌లుక్‌ని ఇటీవల ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండడంతోపాటు సినిమా మీద క్యూరియాసిటీని పెంచి ప్రేక్షకులని ఇంప్రెస్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు మారుతి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ… కొత్త లేడి డైరెక్టర్ రాధిక జయంతి తీసిన మాయ…
కొంచెం వైల్డ్‌గా థింక్ చేయమంటోన్న అఖిల్
అఖిల్ అక్కినేని ఈ మధ్యే అమ్మో మ్యారేజా అంటూ ప్రీటీజర్‌లో అందర్ని ఆకట్టుకున్నాడు. ఈ ఒక్కమాటకి తెలుగు రాష్ట్రాల్లో బ్యాచ్లర్స్ అందరూ ఫిదా అయ్యారు. ఇప్పుడు మీ మ్యారేజ్ లైఫ్ నుంచి మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అడుగుతున్నాడు. అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా మరో నిర్మాత వాసు వర్శతో కలిసి రూపొందిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్‌కి జోడిగా బుట్ట బొమ్మ పూజాహెగ్డే నటిస్తోంది. భలే భలే మగాడివోయ్, గీతగోవిందం చిత్రాలకి సంగీతాన్ని అందించిన గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ప్రీటజర్లో కెరీర్ సెట్ చేసుకున్నా, మ్యారీడ్ లైఫ్ మాత్రం…
‘బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది’ మోషన్ పోస్టర్ విడుదల
మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్ సమర్పణలో మణిదీప్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై లుకాలపు మధు, సోమేశ్ ముచర్ల నిర్మాతలుగా దత్తి సురేష్ బాబు నిర్మాణ నిర్వాహణలో ప్రముఖ కామెడీ హీరో షకలక శంకర్ లీడ్ రోల్లో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది’. నూతన దర్శకుడు కుమార్ కోట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది అనే క్యాచీ టైటిల్‌తో అటు ఆడియెన్స్ ఇటు ఇండస్ట్రీ వర్గాల ఎటెన్షన్ తెచ్చుకున్న ఈ చిత్ర బృందం ఆ తరువాత రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌తో కూడా అనూహ్య స్పందన అందుకున్నారు. ఈ నేపథ్యంలో యూనిట్ సభ్యులు తాజాగా ఓ మోషన్ పోస్టర్ సిద్ధం చేశారు. దసరా సందర్భంగా ఈ మోషన్ పోస్టర్‌ను ప్రముఖ స్టార్ హీరోయిన్ డస్కీ…
మరో చిత్రం ప్రకటించిన పవన్ కల్యాణ్
టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు అధికారికంగా, విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రతిభావంతమైన యువ దర్శకుడు సాగర్.కె. చంద్రను దర్శకునిగా ఎంపిక చేసుకున్నారు. ఇదే విషయాన్ని వివరంగా పొందుపరుస్తూ వినూత్నంగా ఓ వీడియో రూపంలో ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తొలిసారి తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిపారు. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు..’గబ్బర్ సింగ్’ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనదైన నటనతో అశేష ప్రేక్షకులను అలరించిన పవన్ కళ్యాణ్ మరోమారు పోలీస్ పాత్రలో ఈ చిత్రం ద్వారా రక్తి కట్టించనున్నారు. కాగా ఈ…
న్యూ ఆర్టిస్ట్స్ కావాలంటోన్న ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్
ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి నిర్మాణ సారథ్యంలో, సాయిరిషిక సమర్పణలో రజనీ తళ్లూరి నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభం అవ్వనుంది. ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్ నుంచి ప్రొడక్షన్ నెం 6గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి అశ్వధామ ఫేమ్ రమణ తేజ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. దేశరాజ్ సాయితేజ్ ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. గతంలో సాయితేజ్ కల్కి సినిమాకు స్టోరీలు అందిచారు. ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్ వారు ఈ సినిమా కోసం అవరసమైన కీలక నటీనటుల్ని ఎంపిక చేసుకోవడానికి కాస్టింగ్ కాల్ని ఎనౌన్స్ చేశారు. సినిమాల్లోకి రావాలనే ప్రతిభ ఉన్న ఔత్సాహికులకు తమ ప్రొడక్షన్ నెం.6 చిత్రంలో అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నిర్మాత రామ్ తళ్లూరి ప్రకటిస్తూ కాస్టింగ్ కాల్కి సంబంధించిన వివరాలతో ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.…
‘మా వింత గాధ వినుమా’ ఫస్ట్ లుక్ విడుదల
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’.. తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువవుతుంది. ప్రతి శుక్రవారం వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను ‘ఆహా’ ఆకట్టుకుంటోంది. నవంబర్ నెలను మరింత ఎంటర్టైన్మెంట్గా ఆహా మారుస్తుంది. అందులో భాగంగా నవంబర్ 13న ‘మా వింత గాధ వినుమా’ చిత్రం ఆహాలో విడుదలవుతుంది. ఆదిత్య మండల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంలో జోడీగా నటించిన సిద్దు జొన్నలగడ్డ, శీరత్‌కపూర్ ఇందులో జంటగా మెప్పించనున్నారు. ఆహా ప్రమోటర్, ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ‘మా వింత గాధ వినుమా’ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత సంజయ్ రెడ్డి, సిద్ధు జొన్నలగడ్డ, శీరత్‌కపూర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా..అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘తెలుగు ఓటీటీ యాప్‌గా ఆహా ప్రతి నెల క్రమంగా…
వరద బాధితులకు హీరో రాంకీ రూ. 5 లక్షల విరాళం
హైదరాబాద్ వరద బాధితులకు తన వంతు సాయంగా హీరో -నిర్మాత రాంకీ తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్‌కు 5 లక్షల విరాళం అందజేసి తన మంచి మనసును చాటుకున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్‌ను కలిసి స్వయంగా చెక్‌ను అందజేశారు.‘సినిమా వారు ఇలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందించడం హర్షించదగ్గ విషయం అంటూ ప్రశంసించారు కేటీఆర్. ‘గంగ పుత్రులు’ లాంటి మంచి చిత్రంలో హీరోగా నటించి నేషనల్ అవార్డు అందుకున్న రాంకీ వరద బాధితుల కోసం తన వంతు సాయం చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే వరదల వల్ల నిరాశ్రయులైన వారికి ఇటీవల జగద్గిరిగుట్టలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు రాంకీ.