ఆకట్టుకుంటోన్న ‘మిస్‌ ఇండియా’ ట్రైలర్

keerthi suresh miss india trailer released

‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించుకున్న స్టార్‌ హీరోయిన్‌ కీర్తిసురేశ్‌. ఈమె టైటిల్‌ పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ ‘మిస్‌ ఇండియా’. నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై మహేశ్‌ కొనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు. కీర్తిసురేష్‌ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌లో హై బడ్జెట్‌తో రూపొందిన ‘మిస్‌ ఇండియా’ నటిగా ఆమెను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ నవంబర్‌ 4న ప్రముఖ డిజిటల్‌ మాధ్యమం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. తెలుగుతో పాటు ఈ సినిమా తమిళం, మలయాళంలోనూ విడుదలవుతుంది. దసరా సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం చిత్రయూనిట్ విడుదల చేసింది. ట్రైలర్‌ను చూస్తే… సాధారణంగా పిల్లలు డాక్టరో, పోలీసో, లాయరో కావాలని కలలు కంటారు. కానీ.. ఆ కలలను నెరవేర్చుకునేవారు మాత్రం అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన అమ్మాయి…

‘చావు క‌బురు చ‌ల్ల‌గా’.. మ‌ల్లికగా లావణ్య

lavanya tripathi as mallika in Chaavu Kaburu Challaga

డింపుల్‌ బ్యూటి లావ‌ణ్య త్రిపాఠి మ‌ల్లికగా చావుక‌బురు చ‌ల్ల‌గా చిత్రంతో క‌నిపించ‌నుంది. అందాల రాక్ష‌సి చిత్రంలో మ‌నింటి అమ్మాయిలా అంద‌ర్ని త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఇప్ప‌డు మ‌ల్లికగా మొద‌టి లుక్ లోనే అంద‌రికి ద‌గ్గ‌ర‌య్యింది. ఇప్పుడు మ‌ల్లిక మ‌న బ‌స్తి బాల‌రాజుతో జోడి క‌ట్టేసింది. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్‌కు మారుపేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా.. ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. ‌ ఇప్పటికే విడుదలైన టైటిల్.. హీరో కార్తికేయ ‘బ‌స్తి బాల‌రాజు’ ఫ‌స్ట్‌లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియోకి కూడా అనూహ్య స్పంద‌న ల‌భించింది. కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ చూస్తే…

రొమాన్స్ 2 ఇన్ 1 ఫస్ట్ లుక్ విడుదల

romance 2 in 1 first look poster released

యావర అహమ్మద్, మనీషా పిలై ప్రధాన పాత్రలో జి.ఎస్.కె ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సరికొత్త వెబ్ సిరీస్ ‘రొమాన్స్ 2 ఇన్ 1’. ‘ఒకే ఆత్మ హీరో హీరోయిన్ ఇద్దరినీ ప్రేమిస్తే’ అనే ఆసక్తికరమైన కథ కథాంశంతో త్వరలో మీ ముందుకు వస్తుంది. శివ ఈ వెబ్ సిరీస్‌ని స్వీయ దర్శకత్వం చేస్తున్నారు. దసరా పండగ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ యొక్క మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత శివ మాట్లాడుతూ… “ఇది చాలా డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ కథ. మంచి ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిస్తునాం. ఒకే ఆత్మ హీరో హీరోయిన్ ఇద్దరినీ ప్రేమిస్తుంటుంది. అలా ఒకే ఆత్మ హీరో హీరోయిన్ ఇద్దరినీ ఎందుకు ప్రేమిస్తుంది, ఆ ఆత్మ ఎవరు, తన కథ ఏంటి, చివరికి ఏమౌంతుంది అనేది కథ. ఈ…

ఎంజాయ్ సరే.. బిగ్ బాస్ సంగతేంటి నాగ్?

nagarjuna at Himalayas

అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్‌’. ఇది మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మాణ‌మ‌వుతోన్న 6వ చిత్రం. అహిషోర్ సాల్మ‌న్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మ‌నాలీలో ఉన్న సుంద‌ర ప్ర‌దేశాల్లో ఇటీవ‌లే మొద‌లైంది. నాగార్జున షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. అక్క‌డి ప్ర‌కృతి సౌంద‌ర్యానికి ఆయ‌న ప‌ర‌వ‌శించిపోయారు. ప్రేక్ష‌కుల‌తో ఆ ఆనందాన్ని ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. “హాయ్‌.. ఇది రోహ్‌తంగ్ పాస్ (రోహ్‌తంగ్ క‌నుమ‌)లోని అంద‌మైన ఉద‌యం. స‌ముద్ర మ‌ట్టానికి మూడు వేల తొమ్మిది వంద‌ల ఎన‌భై మీట‌ర్ల ఎత్తులో ఉన్న ప్రాంతం. అంటే ప‌ద‌మూడు వేల అడుగుల ఎత్తు. ఇది చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన క‌నుమ‌. న‌వంబ‌ర్ నుంచి మే నెల వ‌ర‌కు దీన్ని మూసేస్తారు. ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ కోసం ఇక్క‌డ‌కు వ‌చ్చాం. ఈ సినిమా…

విశ్వక్‌సేన్‌ రిలీజ్‌ చేసిన లింగోచ్చా టీజ‌ర్

lingoccha teaser out poster

కేరాఫ్ ఆఫ్ కంచెర‌పాలెం చిత్రంలో జోసెఫ్‌గా నటించి వీక్షకుల్ని ఆక‌ట్టుకున్న కార్తీక్ రత్నం హీరోగా, సుప్యార్ధ్ సింగ్ హీరోయిన్‌గా ప్ర‌ముఖ నిర్మాత యాద‌గిరి రాజు శ్రీక‌ళ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో, బ్లాక్ బాక్స్ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో నిర్మిస్తున్న చిత్రం లింగోచ్చా (గేమ్ ఆఫ్ లవ్). ఈ చిత్రానికి ఆనంద్ బ‌డా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ద‌ర్శ‌కుడు హైద‌రాబాది కావ‌టం వ‌ల‌న ఇక్క‌డ ఎంతో ఫేమ‌స్ అయిన లింగోచ్చా గేమ్ నేప‌థ్యంలో ఒక చ‌క్క‌టి ప్రేమ‌క‌థ‌ని రాసుకుని తెర‌కెక్కించారు. అంతే కాదు ఈ ప్రేమ‌క‌థకి లింగోచ్చా అనే టైటిల్‌ని ఖ‌రారు చేయ‌టం విశేషం. ఈ టైటిల్ విన్న ప్ర‌తి ఒక్క‌రూ సౌండింగ్ కొత్తగా వుంద‌ని అన‌టం యూనిట్‌కి కొత్త ఎన‌ర్జీని ఇచ్చినట్లుగా చిత్రయూనిట్ పేర్కొన్నారు. ఇదే ఎన‌ర్జీతో లింగోచ్చా టీజ‌ర్‌ని రెడీ చేశారు. యూత్ ఫుల్ మాస్ హీరోగా ఇటీవ‌లే హ్యూజ్…