Day: October 22, 2020
‘రామరాజు ఫర్ భీమ్’.. టీజర్ అదిరింది
ఎంటైర్ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). ఈ చిత్రం నుండి ‘రామరాజు ఫర్ భీమ్’ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ 119వ జయంతి(అక్టోబర్ 22) సందర్భంగా ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్‌ను మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ విడుదల చేశారు. కొమురం భీమ్ పాత్ర గురించి అల్లూరి సీతారామరాజు వెర్షన్లో సాగుతున్న ఈ టీజర్లో…. ”వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి..నిలబడితే రాజ్యాలు సాగిలపడతాయి..వాడు పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండవాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ..నా తమ్ముడు, గోండు బెబ్బులి కొమురం భీమ్” అంటూ రామ్‌చరణ్ చెబుతున్న డైలాగ్స్, ఎన్టీర్ నటనకు వరల్డ్‌వైడ్‌గా ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో…